Thursday, December 26, 2013

విజయవాడ పుస్తక ప్రదర్శనలో జనవరి 1 నుండి 11 వరకూ కొత్తపల్లి స్టాలు! అందరికీఆహ్వానం!

మిత్రులారా!

విజయవాడ పుస్తక ప్రదర్శన ఈ సంవత్సరం జనవరి ఒకటి నుండి పదకొండో తేదీ వరకు పి డబ్ల్యుడి గ్రౌండ్సులో జరుగుతుందని మీకు తెలుసుగా?
ప్రతి సంవత్సరం మాదిరే ఈసారికూడా అందులో కొత్తపల్లి స్టాలు ఉంటుంది.
విజయవాడ సమీపంలోని మిత్రులు, చందాదారులు స్టాలును తప్పక సందర్శించగలరు.
స్టాలులో కొత్తపల్లి పుస్తకాలను చూడచ్చు, చదవొచ్చు, కొనచ్చు, చందాలు కట్టచ్చు/ పొడిగించుకోవచ్చు, అక్కడే కూర్చొని కథలు రాసి ఇవ్వచ్చు; బొమ్మలు వేసి ఇవ్వొచ్చు, ఊరికే కలిసి మాట్లాడచ్చు, పరిచయం చేసుకోవచ్చు...
విజయవాడలో కలుద్దాం మరి!  మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ మిత్రులు అందరినీ వెంటబెట్టుకొని రండి.


* విజయవాడ పుస్తక ప్రదర్శనలో కొత్తపల్లి స్టాలు నంబరు 281

* జనవరి ఒకటి నుండి పదకొండు వరకు,  ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటిగంటనుండి రాత్రి తొమ్మిది గంటల వరకూ!

తప్పక రండి మరి!!


నమస్కారాలతో,

-నారాయణ,
కొత్తపల్లి బృందం


Saturday, December 21, 2013

కొత్తపల్లి కథల పుస్తకాలను ఇంటికి తెప్పించుకోండి..!

కొత్తపల్లి పత్రికను ఇంటర్నెట్లో చదవటం అందరికీ వీలవ్వక పోవచ్చు.  ముఖ్యంగా పిల్లలు- ఎక్కువ సమయాన్ని వాళ్ళు కంప్యూటర్ల ముందు గడపటం ఏమంత మంచిది కాదెలాగూ.
అంతేకాదు; నిజం పుస్తకాలను చేతిలో పట్టుకొని చదివిన అనుభూతి వేరు; కంప్యూటరు తెరమీద చదవటం వేరు.
కొత్తపల్లి కథల్ని మరింతమంది పిల్లలకు నేరుగా అందించేందుకై ఏనెలకానెల కొత్తపల్లి పత్రికను పూర్తి రంగుల పుస్తకాలుగా పరిమిత సంఖ్యలో ముద్రించటం జరుగుతున్నది.
 కొత్తపల్లి పత్రిక ముద్రిత ప్రతులు "కొత్తపల్లి కథల పుస్తకాలు"గా రంగుల ఆఫ్‌సెట్లో 2011 జనవరి నుండి లభిస్తున్నాయి.
వివరాలు:

2011లో వెలువడిన 12 పుస్తకాల సంపుటి వెల- రూ. 300/- (పోస్టలు ఛార్జీలు కలుపుకొని)

2012లో వెలువడిన 12 పుస్తకాల సంపుటి వెల- రూ. 300/-  (పోస్టలు ఛార్జీలు కలుపుకొని)2013 లో వెలువడిన 07 పుస్తకాల చిరుసంపుటి వెల- రూ. 175/-  (పోస్టలు ఛార్జీలు కలుపుకొని)

అంతకు ముందు 2008 నుండి 2010 వరకు ముద్రించబడిన ప్రతులు ప్రస్తుతం అందుబాటులో‌ లేవు.

ఈ మొత్తాలను యం.వో/డిడి/బ్యాంకు ట్రాన్సుఫర్ ద్వారా "Kottapalli Prachuranalu" పేర పంపించవచ్చు.

పోస్టలు చిరునామా:

Kottapalli prachuranalu,
1-127/A, Near MRO Office,
Chennekothapalli,
Anantapatur (Dist.)
Andhra Pradesh
PIN: 515101
ఫోను (ఆఫీసు): 08559 240495, 7702877670

ఈ-మెయిలు: team@kottapalli.in

బ్యాంకు అకౌంటు వివరాలు:

Kottapalli Prachuranalu,
Savings A/C No: 62320333310
SBH- Dharmavaram Branch,
ISFC Code: SBHY0020902

కొత్తపల్లికి విరాళాలు పంపండి!


పిల్లలలో తెలుగు పట్ల ఆదరణ పెంచేందుకుగాను కొత్తపల్లిని చాలావరకు స్వచ్ఛందంగా నడిపిస్తూ వస్తున్నాం. దీనికై మీ వంతుగా, మీకు తోచినంత మొత్తాలను, ఎప్పుడు వీలైతే అప్పుడు, విరాళంగా ఇస్తూ ఉండమని విన్నపం.


* కొత్తపల్లి ప్రతుల  ముద్రణ వ్యయం జనవరి 2013 నుండి ప్రతి నెలా 33000రూ. అవుతున్నది.  సహృదయులైన మిత్రులు వ్యక్తిగతంగా- తమ శక్తి కొద్దీ ఒకనెల- రెండు నెలలు- పలు నెలలు- ఇలా ముద్రణ వ్యయాన్ని భరించగలిగితే గొప్ప సాయం కాగలదు.

* కొత్తపల్లిలో బొమ్మలు గీస్తున్న కళాకారులకు, అక్షరాలను కూరుస్తున్న విద్యార్థులు కొందరికి, పత్రిక ప్రతుల్ని దుకాణాలకు- పాఠకులకు అందించటంలో సాయపడుతున్న యువకులకు కొందరికి  ప్రతినెలా చిన్నపాటి పారితోషికాలు ఇవ్వటం జరుగుతున్నది.  ఈ మొత్తాలు, పుస్తకాల రవాణా, ఆఫీసు నిర్వహణ ఖర్చులు ప్రతినెలా సరాసరిన 15,000రూ. అవుతున్నాయి.  మిత్రులు  ఈ మొత్తాలలో కొన్నింటిని తమ వంతుగా అందించగలరేమో చూడవచ్చు.

*  1,000 రూ -లేదా ఆ పైన- విరాళంగా ఇచ్చిన దాతలకు ఒక సంవత్సరం పాటు పత్రిక ప్రతులను కృతజ్ఞతా పూర్వకంగా అందించగలం. 

* మీ విరాళాలను "కొత్తపల్లి ప్రచురణలు" పేరిట పై చిరునామాకు  మనీఆర్డరు/బ్యాంకు ట్రాన్సుఫర్ల ద్వారా పంపగలరు. కొత్తపల్లి పత్రికకు నేరుగా విదేశీ నిధులు స్వీకరించే సదుపాయం లేదు- కనుక మీ విరాళాలను కేవలం భారతీయ బ్యాంకుల ద్వారా/తపాలా శాఖ ద్వారా (రూపాయలలో మాత్రమే) అందించగలరని మనవి.

Monday, November 4, 2013

కొత్తపల్లి మళ్ళీ వస్తోంది..!

మిత్రులకు, కొత్తపల్లి అభిమానులకు-
నమస్కారం.
నాల్గు నెలల విరామం తర్వాత, ఈ జనవరి సంచికతో కొత్తపల్లిని తిరిగి మొదలు పెట్టాలని నిర్ణయం.
జనవరి ఒకటికల్లా కొత్తపల్లి-64 అంగళ్ళను, చందాదారుల ఇళ్ళను చేరాలని సంకల్పం.

ఇక మీరూ, మీ పిల్లలూ రాసిన క్రిస్మస్ కథల్ని, కొత్త సంవత్సరం కథల్ని త్వరత్వరగా పంపించండి!
కొత్త సంవత్సరంలో నిండా చక్కని కథల్తో అందర్నీ పలకరిద్దాం!!

-నారాయణ
ఎడిటర్, కొత్తపల్లి

మరో మాట:  కొత్తపల్లి పుస్తకాలను ఎలా తెప్పించుకోవచ్చో ఇక్కడ చూడండి:
http://blog.kottapalli.in/2013/03/blog-post.html

Thursday, September 26, 2013

కొత్తపల్లికో చిన్న విరామం...

మిత్రులకు, కొత్తపల్లి చందాదారులకు-

నమస్కారాలు.

కొత్తపల్లి సెప్టెంబరు సంచిక (పుస్తకం 64) ఇంకా రాలేదేమని మీరు అనుకుంటూ ఉంటారు.  ఈ సంవత్సరం కొత్తపల్లిని సమయానికి తీసుకొని రావడం చాలా కష్టమయిపోతోంది- రక రకాల పనుల ఒత్తిడి కారణంగా.

అందువల్ల కొత్తపల్లిని కొంతకాలంపాటు ఆపేసి, పనుల ఒత్తిడి తగ్గిన తర్వాత, వీలును బట్టి మెల్లగా  మొదలు పెడదామని అనుకున్నాము. 

కొత్తపల్లిని అభిమానించే పాఠకులకు ఇలాంటి నిర్ణయం బాధ కలిగించవచ్చు.  ఉన్నట్టుండి తీసుకున్న ఈ నిర్ణయం  ఇబ్బందిగానే ఉంది.  అందరూ అర్థం చేసుకొని క్షమించగలరు.  మీ అందరి సహకారం లేకుంటే మేము 63 కొత్తపల్లి పుస్తకాలు ప్రచురించి ఉండగలిగే వాళ్ళం కాదు. చాలా మంది మిత్రులు, శ్రేయోభిలాషులు ఇచ్చిన అమూల్యమైన సమయం, సలహాలు, ఆర్థిక సహాయం ఈ పనిని ముదుకు నడిపించాయి. వారందరికీ మా ధన్యవాదాలు.

చాలా మంది చందాదారులకు ఇంకొన్ని పుస్తకాలు పంపవలసి ఉన్నది. ఉదాహరణకు గత హైదరాబాద్ బుక్ ఫెయిర్, విజయవాడ బుక్ ఫెయిర్ లలో చందాలు కట్టిన వారికి ఇంకా ఐదేసి పుస్తకాలు పంపవలసి ఉన్నది. వాళ్లందరికీ ఎవరికి పంపవలసిన కాపీలకు సమానమైన డబ్బు వాళ్లకు తిరిగి పంపబోతున్నాం- ఒక్కరొక్కరుగా  ఇప్పటికే ఈ పని మొదలు పెట్టాము కూడా. అక్టోబరు చివరికల్లా అందరికీ మిత్రులద్వారాను- వాలంటీర్లు, మనియార్డరు, చెక్కుల ద్వారాను- వాళ్ళ వాళ్ళ డబ్బులు తిరిగి అందజేస్తాం.

పత్రికను ఇంతకాలం పాటు ఆదరించినందుకు ధన్యవాదాలు.  కొత్తపల్లిని త్వరలోనే మళ్ళీ- సరిక్రొత్త రూపంలో చూడగలమని మేమూ ఆశిస్తున్నాం.  అప్పుడు మళ్ళీ కలుద్దాం- అంతవరకు సెలవు.


సుబ్బరాజు, నారాయణ, ఆనంద్
కొత్తపల్లి ట్రస్టు

Friday, March 8, 2013

కొత్తపల్లి పుస్తకాలను ఎలా తెప్పించుకోవాలి?

విపరీతంగా పెరిగిన ఖర్చుల కారణంగా 2013 జనవరి నుండీ కొత్తపల్లి పత్రిక ముద్రిత ప్రతుల వెలను పెంచక తప్పటం లేదు.  సహృదయులైన పాఠకులు మన్నించి ఎప్పటిలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాం. 
                                                                         - కొత్తపల్లి బృందం


విడి ప్రతి వెల: 25 రూ.

సంవత్సర చందా: 300 రూ.


కొత్తపల్లి పత్రిక ముద్రిత ప్రతులు "కొత్తపల్లి కథల పుస్తకాలు"గా రంగుల ఆఫ్‌సెట్లో 2011 జనవరి నుండి లభిస్తున్నాయి.

వివరాలు:

2011లో వెలువడిన 12 పుస్తకాల సంపుటి వెల- రూ. 300/- (పోస్టలు ఛార్జీలు కలుపుకొని)

2012లో వెలువడిన 12 పుస్తకాల సంపుటి వెల- రూ. 300/-  (పోస్టలు ఛార్జీలు కలుపుకొని)2013 లో వెలువడిన 03 పుస్తకాల చిరుసంపుటి వెల- రూ. 75/-  (పోస్టలు ఛార్జీలు కలుపుకొని)

ఇకపై రానున్న ప్రతుల్ని నెలనెలా ఇంటికి/బడికి/లైబ్రరీకి నేరుగా పోస్టులో‌ తెప్పించుకునేందుకుగాను చందా కట్టే వీలున్నది- సంవత్సర చందా రూ 300/-  (పోస్టలు ఛార్జీలు కలుపుకొని)

తెలుపు-నలుపుల్లో ఇంక్‌జెట్ ప్రింటర్లో ముద్రించిన ప్రతులు:** 2008 సంచికలు 8 (ఏప్రియల్-డిసెంబరు) వెల: రూ 200/-
** 2009 సంచికలు 12 (జనవరి-డిసెంబరు) వెల: రూ 300/-

ఈ మొత్తాలను యం.వో/డిడి/బ్యాంకు ట్రాన్సుఫర్ ద్వారా "Kottapalli Trust" పేర పంపించవచ్చు.

పోస్టలు చిరునామా:

Kottapalli Trust
Near MRO Office,
Chennekothapalli,
Anantapatur (Dist.)
Andhra Pradesh
PIN: 515101

ఫోను: 08559 240222, 7702877670

ఈ-మెయిలు: team@kottapalli.in

బ్యాంకు అకౌంటు వివరాలు:

Kottapalli Trust,
A/C No: 0138101018809
Account Type: Savings
Canara Bank,
Chennekothapalli

IFSC Code: CNRB0000138


కొత్తపల్లికి విరాళాలు పంపవచ్చా?


పిల్లలలో తెలుగు పట్ల ఆదరణ పెంచేందుకుగాను కొత్తపల్లిని చాలావరకు స్వచ్ఛందంగా నడిపిస్తూ వస్తున్నాం. దీనికై మీ వంతుగా, మీకు తోచినంత మొత్తాలను, ఎప్పుడు వీలైతే అప్పుడు, విరాళంగా ఇస్తూ ఉండమని విన్నపం.


* కొత్తపల్లి ప్రతుల  ముద్రణ వ్యయం జనవరి 2013 నుండి ప్రతి నెలా 32,000రూ. అవుతున్నది.  సహృదయులైన మిత్రులు వ్యక్తిగతంగా- తమ శక్తి కొద్దీ ఒకనెల- రెండు నెలలు- పలు నెలలు- ఇలా ముద్రణ వ్యయాన్ని భరించగలిగితే గొప్ప సాయం కాగలదు.

* కొత్తపల్లిలో బొమ్మలు గీస్తున్న విద్యార్థులకు, అక్షరాలను కూరుస్తున్న విద్యార్థులు కొందరికి ప్రతినెలా చిన్నపాటి పారితోషికాలు ఇవ్వటం జరుగుతున్నది.  ఈ మొత్తాలు, పుస్తకాల రవాణా, ఆఫీసు నిర్వహణ ఖర్చులు ప్రతినెలా సరాసరిన 15,000రూ. అవుతున్నాయి.  మిత్రులు  ఈ మొత్తాలలో కొన్నింటిని తమ వంతుగా అందించగలరేమో చూడవచ్చు.

*  10,000 రూ -లేదా ఆ పైన- విరాళం ఇచ్చిన దాతల్ని శాశ్వత చందాదారులుగా గుర్తించి, పత్రిక వెలువడినన్నినాళ్ళూ ప్రతినెలా కొత్తపల్లి ప్రతినొకదాన్ని పంపగలం.

* మీ విరాళాలను కొత్తపల్లి ట్రస్టు పేరిట పై చిరునామాకు  మనీఆర్డరు/బ్యాంకు ట్రాన్సుఫర్ల ద్వారా పంపగలరు. కొత్తపల్లి పత్రికకు నేరుగా విదేశీ నిధులు స్వీకరించే సదుపాయం లేదు- కనుక మీ విరాళాలను కేవలం భారతీయ బ్యాంకుల ద్వారా/తపాలా శాఖ ద్వారా (రూపాయలలో మాత్రమే) అందించగలరని మనవి.

Sunday, January 6, 2013

విజయవాడ పుస్తక మహోత్సవంలో కొత్తపల్లి!


మిత్రులారా,
 విజయవాడ పుస్తక మహోత్సవం ప్రతి సంవత్సరం మాదిరే ఈసారి కూడా  పిడబ్ల్యుడి గ్రౌండ్సు లో జనవరి 1 నుండి 11 వరకూ జరుగుతున్నది.  అందులో కొత్తపల్లి పుస్తకాల దుకాణం (స్టాలు నెంబరు 48) ని విజయవాడలోని మిత్రులందరూ తప్పక సందర్శించగలరు.
విజయవాడ చుట్టుప్రక్కల ఉండే పిల్లలు అందరూ తాము రాసిన కథల్ని తీసుకొచ్చి నేరుగా సుబ్బరాజుగారి చేతికి ఇవ్వొచ్చు.  అక్కడే కూర్చొని రాసి ఇచ్చేయచ్చు కూడాను!  కాబట్టి పదండి మరి, విజయవాడ పుస్తక మహోత్సవంలో స్టాలు నెంబరు 48కి!