Monday, December 17, 2012

హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో కొత్తపల్లి!

మిత్రులారా,
హైదరాబాదు పుస్తక ప్రదర్శన ప్రతి సంవత్సరం మాదిరే ఈసారి కూడా  నెక్లెస్ రోడ్డులో డిసెంబరు 14 నుండి 25 వరకూ జరుగుతున్నది.  అందులో కొత్తపల్లి పుస్తకాల దుకాణం (స్టాలు నెంబరు 71) ను హైదరాబాదులోని మిత్రులందరూ తప్పక సందర్శించగలరు.
హైదరాబాదు చుట్టుప్రక్కల ఉండే పిల్లలు అందరూ తాము రాసిన కథల్ని తీసుకొచ్చి నేరుగా సుబ్బరాజుగారి చేతికి ఇవ్వొచ్చు.  అక్కడే కూర్చొని రాసి ఇచ్చేయచ్చు కూడాను!  కాగితంతో ఏవేవో బొమ్మలు చేయటం నేర్చుకునే వీలు కూడా ఉంది- కాబట్టి పదండి మరి, హైదరాబాదు బుక్ ఫెయిర్ లో స్టాలు నెంబరు 71కి!
Friday, December 14, 2012

కొత్తపల్లి కథల పుస్తకాలను ఎలా తెప్పించుకోవాలి?

విపరీతంగా పెరిగిన ఖర్చుల కారణంగా 2013 జనవరి నుండీ కొత్తపల్లి పత్రిక ముద్రిత ప్రతుల వెలను పెంచక తప్పటం లేదు.  సహృదయులైన పాఠకులు మన్నించి ఎప్పటిలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాం. 
                                                                         - కొత్తపల్లి బృందం


విడి ప్రతి వెల: 25 రూ.

సంవత్సర చందా: 300 రూ.


కొత్తపల్లి పత్రిక ముద్రిత ప్రతులు "కొత్తపల్లి కథల పుస్తకాలు"గా రంగుల ఆఫ్‌సెట్లో 2011 జనవరి నుండి లభిస్తున్నాయి.

వివరాలు:

2011లో వెలువడిన 12 పుస్తకాల సంపుటి వెల- రూ. 300/- (పోస్టలు ఛార్జీలు కలుపుకొని)

2012లో వెలువడిన 12 పుస్తకాల సంపుటి వెల- రూ. 300/-  (పోస్టలు ఛార్జీలు కలుపుకొని)ఇకపై రానున్న ప్రతుల్ని నెలనెలా ఇంటికి/బడికి/లైబ్రరీకి నేరుగా పోస్టులో‌ తెప్పించుకునేందుకుగాను చందా కట్టే వీలున్నది- సంవత్సర చందా రూ 300/-  (పోస్టలు ఛార్జీలు కలుపుకొని)

తెలుపు-నలుపుల్లో ఇంక్‌జెట్ ప్రింటర్లో ముద్రించిన ప్రతులు:** 2008 సంచికలు 8 (ఏప్రియల్-డిసెంబరు) వెల: రూ 200/-
** 2009 సంచికలు 12 (జనవరి-డిసెంబరు) వెల: రూ 300/-

ఈ మొత్తాలను యం.వో/డిడి/బ్యాంకు ట్రాన్సుఫర్ ద్వారా "Kottapalli Trust" పేర పంపించవచ్చు.

పోస్టలు చిరునామా:

Kottapalli Trust
Near MRO Office,
Chennekothapalli,
Anantapatur (Dist.)
Andhra Pradesh
PIN: 515101

ఫోను: 08559 240222, 7702877670

ఈ-మెయిలు: team@kottapalli.in

బ్యాంకు అకౌంటు వివరాలు:

Kottapalli Trust,
A/C No: 0138101018809
Account Type: Savings
Canara Bank,
Chennekothapalli

IFSC Code: CNRB0000138


కొత్తపల్లికి విరాళాలు పంపవచ్చా?


పిల్లలలో తెలుగు పట్ల ఆదరణ పెంచేందుకుగాను కొత్తపల్లిని చాలావరకు స్వచ్ఛందంగా నడిపిస్తూ వస్తున్నాం. దీనికై మీ వంతుగా, మీకు తోచినంత మొత్తాలను, ఎప్పుడు వీలైతే అప్పుడు, విరాళంగా ఇస్తూ ఉండమని విన్నపం.


* కొత్తపల్లి ప్రతుల  ముద్రణ వ్యయం జనవరి 2013 నుండి ప్రతి నెలా 32,000రూ. కానున్నది.  సహృదయులైన మిత్రులు వ్యక్తిగతంగా- తమ శక్తి కొద్దీ ఒకనెల- రెండు నెలలు- పలు నెలలు- ఇలా ముద్రణ వ్యయాన్ని భరించగలిగితే గొప్ప సాయం కాగలదు.

* కొత్తపల్లిలో బొమ్మలు గీస్తున్న విద్యార్థులకు, అక్షరాలను కూరుస్తున్న విద్యార్థులు కొందరికి ప్రతినెలా చిన్నపాటి పారితోషికాలు ఇవ్వటం జరుగుతున్నది.  ఈ మొత్తాలు, పుస్తకాల రవాణా, ఆఫీసు నిర్వహణ ఖర్చులు ప్రతినెలా సరాసరిన 15,000రూ. అవుతున్నాయి.  మిత్రులు  ఈ మొత్తాలలో కొన్నింటిని తమ వంతుగా అందించగలరేమో చూడవచ్చు.

*  10,000 రూ -లేదా ఆ పైన- విరాళం ఇచ్చిన దాతల్ని శాశ్వత చందాదారులుగా గుర్తించి, పత్రిక వెలువడినన్నినాళ్ళూ ప్రతినెలా కొత్తపల్లి ప్రతినొకదాన్ని పంపగలం.

* మీ విరాళాలను కొత్తపల్లి ట్రస్టు పేరిట పై చిరునామాకు  మనీఆర్డరు/బ్యాంకు ట్రాన్సుఫర్ల ద్వారా పంపగలరు. కొత్తపల్లి పత్రికకు నేరుగా విదేశీ నిధులు స్వీకరించే సదుపాయం లేదు- కనుక మీ విరాళాలను కేవలం భారతీయ బ్యాంకుల ద్వారా/తపాలా శాఖ ద్వారా (రూపాయలలో మాత్రమే) అందించగలరని మనవి.

Wednesday, September 12, 2012

ప్రజాసాహితి పత్రికలో కొత్తపల్లి పత్రిక- జూన్ 2012 సంచికపై సమీక్ష!

ప్రజాసాహితి పత్రికలో కొత్తపల్లి కథల పుస్తకం- 50 (జూన్ 2012) ని సమీక్షిస్తూ వచ్చిన వ్యాసం నకలు...

కొత్తపల్లి కథల పుస్తకం- 50 (జూన్ 2012) పై ఈనాడువారి సమీక్ష

కొత్తపల్లి పత్రిక జూన్ సంచికని ( http://kottapalli.in/2012/06/welcome )  శ్రీకాకుళం‌జిల్లా టెక్కలి ప్రభుత్వోన్నత పాఠశాల ప్రత్యేక సంచికగా వెలువరించిన సంగతి గుర్తుందిగా?
దాని గురించి ఈనాడు దిన పత్రిక శ్రీకాకుళం ఎడిషన్లో వచ్చిన సమీక్ష నకలు ఇది..

Wednesday, February 8, 2012

కొత్తపల్లి కథల పుస్తకాలను ఎలా తెప్పించుకోవాలి?

కొత్తపల్లి పత్రిక ముద్రిత ప్రతులు "కొత్తపల్లి కథల పుస్తకాలు"గా రంగుల ఆఫ్‌సెట్లో 2011 జనవరి నుండీ లభిస్తున్నాయి.

వివరాలు:

2011లో వెలువడిన 12 పుస్తకాల సంపుటి వెల- రూ. 250/- (పోస్టలు ఛార్జీలు కలుపుకొని)

2012లో వెలువడిన 9 పుస్తకాలు(జనవరి నుండి సెప్టెంబరు వరకు)- ఒక్కొక్కటి రూ. 20/-  (దయచేసి ప్రతి ఆర్డరుకు అదనంగా రూ.10 పోస్టలు ఖర్చులుగా జత చేయండి)

ఇకపై రానున్న ప్రతుల్ని నెలనెలా ఇంటికి/బడికి/లైబ్రరీకి నేరుగా పోస్టులో‌ తెప్పించుకునేందుకుగాను చందా కట్టే వీలున్నది- సంవత్సర చందా రూ 250/-  (పోస్టలు ఛార్జీలు కలుపుకొని)

పిల్లలలో తెలుగు పట్ల ఆదరణ పెంచేందుకుగాను కొత్తపల్లిని చాలావరకు స్వచ్ఛందంగా నడిపిస్తూ వస్తున్నాం. దీనికై మీ వంతుగా, మీకు తోచినంత మొత్తాలను, ఎప్పుడు వీలైతే అప్పుడు, విరాళంగా ఇస్తూ ఉండమని విన్నపం.
10,000 రూ -లేదా ఆ పైన- విరాళం ఇచ్చిన దాతల్ని శాశ్వత చందాదారులుగా గుర్తించి, ప్రతినెలా కొత్తపల్లి ప్రతినొకదాన్ని పంపగలం.తెలుపు-నలుపుల్లో ఇంక్‌జెట్ ప్రింటర్లో ముద్రించిన ప్రతులు:
** 2008 సంచికలు 8 (ఏప్రియల్-డిసెంబరు) వెల: రూ 170/-
** 2009 సంచికలు 12 (జనవరి-డిసెంబరు) వెల: రూ 250/-

ఈ మొత్తాలను యం.వో/డిడి/బ్యాంకు ట్రాన్సుఫర్ ద్వారా "Kottapalli Trust" పేర పంపించవచ్చు.

పోస్టలు చిరునామా:

Kottapalli Trust
Near MRO Office,
Chennekothapalli,
Anantapatur (Dist.)
Andhra Pradesh
PIN: 515101

ఫోను: 08559 240222, 7702877670

ఈ-మెయిలు: team@kottapalli.in

బ్యాంకు అకౌంటు వివరాలు:

Kottapalli Trust,
A/C No: 0138101018809
Account Type: Savings
Canara Bank,
Chennekothapalli

IFSC Code: CNRB0000138

Monday, January 2, 2012

విజయవాడ పుస్తక మహోత్సవంలో కొత్తపల్లి అంగడిజనవరి 1 నుండి జనవరి 11 వరకు జరుగుతున్న విజయవాడ పుస్తకమహోత్సవంలో కొత్తపల్లి పుస్తకాల అంగడి పెట్టాము. స్టాల్ నంబరు 182-183.

ఈసారి కొత్తపల్లి పుస్తకాలతో పాటూ నేషనల్ బుక్ ట్రష్ట్, ప్రథమ్ బుక్స్, తులికా బుక్స్ వారు ప్రచురించిన మంచి మంచి పిల్లల పుస్తకాలు కూడా ప్రదర్శిస్తునాము.

కొత్తపల్లి కధల పుస్తకాలను చూడటానికి, కొత్తపల్లికి చందా కట్టడానికి, మీ చందాలను రెన్యూ చేయించుకోవడానికి ఇదొక మంచి అవకాశం.

విజయవాడ పరిసరాలోన్ని మిత్రులంతా రండి. కొత్తపల్లి పుస్తకాల అంగడి తరపున మీకందరికీ స్వాగతం.