కొత్తపల్లి పత్రిక ముద్రిత ప్రతులు "కొత్తపల్లి కథల పుస్తకాలు"గా రంగుల ఆఫ్‌సెట్లో 2011 జనవరి నుండీ లభిస్తున్నాయి.
వివరాలు: (వెలలన్నీ పోస్టలు ఛార్జీలు కలుపుకొని)
2011లో వెలువడిన 12 పుస్తకాల సంపుటి వెల- రూ. 240/-
2012లో వెలువడిన 2 పుస్తకాలు(జనవరి మరియు ఫిబ్రవరి)- ఒక్కొక్కటి రూ. 20/-
ఇకపై రానున్న ప్రతుల్ని నెలనెలా ఇంటికి/బడికి/లైబ్రరీకి నేరుగా పోస్టులో తెప్పించుకునేందుకుగాను చందా కట్టే వీలున్నది- సంవత్సర చందా రూ 240/-
తెలుపు-నలుపుల్లో ఇంక్‌జెట్ ప్రింటర్లో ముద్రించిన ప్రతులు:
** 2008 సంచికలు 8 (ఏప్రియల్-డిసెంబరు) వెల: రూ 160/-
** 2009 సంచికలు 12 (జనవరి-డిసెంబరు) వెల: రూ 240/-
ఈ మొత్తాలను యం.వో/డిడి/బ్యాంకు ట్రాన్సుఫర్ ద్వారా "Kottapalli Trust" పేర పంపించవచ్చు.
పోస్టలు చిరునామా:
Kottapalli Trust
Near MRO Office,
Chennekothapalli,
Anantapatur (Dist.)
Andhra Pradesh
PIN: 515101
ఫోను: 08559 240222, 7702877670
ఈ-మెయిలు: team@kottapalli.in
బ్యాంకు అకౌంటు వివరాలు:
Kottapalli Trust,
A/C No: 0138101018809
Account Type: Savings
Canara Bank,
Chennekothapalli
IFSC Code: CNRB0000138
కొత్తపల్లి
Wednesday, February 8, 2012
Monday, January 2, 2012
విజయవాడ పుస్తక మహోత్సవంలో కొత్తపల్లి అంగడి
జనవరి 1 నుండి జనవరి 11 వరకు జరుగుతున్న విజయవాడ పుస్తకమహోత్సవంలో కొత్తపల్లి పుస్తకాల అంగడి పెట్టాము. స్టాల్ నంబరు 182-183.
ఈసారి కొత్తపల్లి పుస్తకాలతో పాటూ నేషనల్ బుక్ ట్రష్ట్, ప్రథమ్ బుక్స్, తులికా బుక్స్ వారు ప్రచురించిన మంచి మంచి పిల్లల పుస్తకాలు కూడా ప్రదర్శిస్తునాము.
కొత్తపల్లి కధల పుస్తకాలను చూడటానికి, కొత్తపల్లికి చందా కట్టడానికి, మీ చందాలను రెన్యూ చేయించుకోవడానికి ఇదొక మంచి అవకాశం.
విజయవాడ పరిసరాలోన్ని మిత్రులంతా రండి. కొత్తపల్లి పుస్తకాల అంగడి తరపున మీకందరికీ స్వాగతం.
Friday, December 9, 2011
26వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో కొత్తపల్లి అంగడి!

హైదరాబాదులో ప్రతి సంవత్సరం డిసెంబరు మాసంలో జరిగే పుస్తక ప్రదర్శనలో ఈసారి కొత్తపల్లి అంగడిని కూడా పెట్టబోతున్నాం. స్టాలు నెంబరు వగయిరాలు 14వ తేదీన తెలుస్తాయట.
గత నాలుగైదు సంవత్సరాలలో మాదిరిగానే ఈసారి కూడా పుస్తక ప్రదర్శన నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో జరగనున్నది.
మొత్తంమీద డిసెంబరు 15వ తేదీనుండి 25వ తేదీ వరకు మేం కొందరం హైదరాబాదులో మకాం పెడుతున్నాం.
హైదరాబాదు నుండి ప్రతినెలా కనీసం 600-700 మంది కొత్తపల్లి పత్రికను చదువుతున్నట్లు తెలుస్తున్నది. ఈ ఆరేడు వందలమందిలో సగంమందినైనా పుస్తక ప్రదర్శన సందర్భంగా కలుస్తామో?!
వీళ్లలో చాలామందికి కొత్తపల్లి ముద్రిత ప్రతులతో- ("కొత్తపల్లి పిల్లల కథల పుస్తకాలతో") పరిచయం లేదు. పుస్తక ప్రదర్శన సందర్భంగా వాళ్ళు వాటిని చూడచ్చు (;ఎట్లాగూ నచ్చుతాయి గనక, చందాదారులవ్వచ్చు!)
ఇప్పటికే చందాదారులైనవాళ్ళు, పాత మిత్రులు కథలు, జోకులు, బొమ్మలు పట్టుకురావచ్చు; రానున్న కొత్తపల్లుల కోసం తమ రచనల్ని నేరుగా మా చేతికే అందివ్వచ్చు!
కొత్తపల్లి కథల పుస్తకాలతోబాటు ఈ అంగడిలో నేషనల్ బుక్ ట్రస్టునుండి, ప్రథమ్ బుక్స్ నుండి ఎంపిక చేసిన తెలుగు పుస్తకాలు కొన్నింటిని కూడా అమ్మబోతున్నాం.
ఈ "కొత్తపల్లి పుస్తకాల అంగడి"ని ఇంకొంచెం విస్తరించి, మరింతమంది ప్రచురణకర్తల మంచి పుస్తకాలనూ కలుపుకొని, జనవరిలో రానున్న విజయవాడ పుస్తక మహోత్సవంలోను, అటుపైన కూడాను నిరంతరంగా- పుస్తకాలను అందిస్తూ పోవాలని అనుకుంటున్నాం. కొత్తపల్లి వెబ్సైటును దానికి తగిన విధంగా పునర్వ్యవస్థీకరించే పని జరుగుతున్నది.
హైదరాబాదు పరిసరాల్లోని మిత్రులంతా రండి. కొత్తపల్లి పుస్తకాల అంగడి తరపున మీ అందరికీ స్వాగతం!
Friday, November 19, 2010
ZP High School లో లైనక్సు మెషీన్లు!
కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం వారు బడులలో కంప్యూటర్ సెంటర్లను అట్టహాసంగా మొదలెట్టిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజుల్లో NIIT వాళ్ళు ప్రభుత్వం తరపున బడులలో కంప్యూటర్ సెంటర్లను నడిపించారు- పిల్లలకోసం వాళ్ళు ప్రత్యేకంగా 'కంప్యూటర్ పుస్తకాలు' (!) ముద్రించి పంచారు కూడాను. ఇక అప్పటినుండి ఎనిమిదో తరగతినుండి పిల్లలు మామూలు పరీక్షలకు అదనంగా 'కంప్యూటర్ పరీక్షలు' రాయాలని నిర్దేశించారు! :(
('ఆ కంప్యూటర్ సెంటర్లలో పిల్లలకు ఏమి నేర్పించారు, పిల్లల్ని పరీక్షలో ఏమి అడిగారు'- అని చూస్తే కొంచెం నవ్వూ, కొంచెం ఏడుపూ వస్తాయి: పిల్లలకు వాళ్ళు "విండోస్ నేర్పారు" (అంటే మైక్రోసాఫ్టు వర్డు, ఎక్సెలు, పెయింటు వగైరాలన్నమాట!! )
పరీక్షలోఅడిగే మాదిరి ప్రశ్న: " యం యస్ వర్డులో 'వ్యూ' మెనులో ఏమేమి ఉంటాయి?" -ఇలాంటివాటికి జవాబు నాకూ తెలీదు! :) )
అన్ని విండోస్ యంత్రాల లాగానే ఈ సెంటర్లలోని యంత్రాలు కూడా ఘోరమైన వైరసుల బారిన పడి కొన్ని, కాలక్రమంలో కొన్నీ మూలపడ్డాయి. మిగిలినవీ చాలా అసంతృప్తితో నత్తనడక నడుస్తున్నాయి.
ఈమధ్య కొత్తపల్లిని చూసేందుకు వచ్చిన స్థానిక జిల్లాపరిషత్ స్కూలు హెడ్మాస్టారు గారికి మేం లైనెక్సు యంత్రాల్లో ఆడుతూ పాడుతూ పనిచేసుకోవటం నచ్చింది. విండోస్ తో ఏమేం చెయ్యచ్చో అవన్నీ- నిజానికి వాటికంటే ఎక్కువ మంచి పనులు- ఉబుంటుతో చెయ్యచ్చని మేం ఆయనకు లైవ్ డెమో ఇచ్చాం. ఏవి కావాలంటే అవి- శృతిపెట్టె నుండి హోమియోపతి సాఫ్టువేరు వరకూ- చక్కటి సలహాలతో సహా- దొరికే వీలుంటుందని చూపేసరికి- ఆయన మొదట తన ఇంట్లో ఉన్న విండోస్ యంత్రాన్ని ఉబుంటు లైనెక్సు లోని మార్చేసుకున్నారు, ఆ తర్వాత బడిలో సమస్యగా ఉన్న ఒక యంత్రంలో ప్రయోగాత్మకంగా లైనెక్సు ఇన్స్టాలు చేయించుకున్నారు. And he is happy!!
బడిలో మూలన పడి ఉన్న ఎనిమిది యంత్రాలను లైనెక్సు ద్వారా త్వరలో మళ్ళీ బ్రతికించాలని మా ఆలోచన..అది గనక జరిగితే ఇక్కడి ప్రభుత్వ బడిలో పిల్లలకి విండోస్ కంటే మంచి ఆపరేటింగ్ సిస్టంలు ఉన్నాయని అర్థమౌతుంది, తప్పనిసరిగా. పెద్దలకూ అర్థమవ్వచ్చు.. ఆపైన వాళ్ళు మైక్రోసాఫ్టును వదిలెయ్యచ్చు, పూర్తిగా!!! అటుపైన పిల్లల్ని ఎవ్వరూ యం యస్ వర్డు ప్రశ్నలు అడగరు!!! ప్రపంచం ఎంత అందంగా ఉంటుందప్పుడు!!

Tuesday, November 2, 2010
స్వాగతం!
కొత్తపల్లి బ్లాగుకు స్వాగతం.
ఇక్కడ కొత్తపల్లి పత్రిక (http://kottapalli.in) కు సంబంధించిన చిన్నా-చితకా విషయాలనుండి పెద్ద పెద్ద విషయాల వరకూ ప్రస్తావించాలని ఉద్దేశం.
ఇక్కడ కొత్తపల్లి పత్రిక (http://kottapalli.in) కు సంబంధించిన చిన్నా-చితకా విషయాలనుండి పెద్ద పెద్ద విషయాల వరకూ ప్రస్తావించాలని ఉద్దేశం.
Subscribe to:
Posts (Atom)